Viral Video : జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్

అత్యంత వేగంగా వేటాడే జంతువుల్లో చిరుత మొదటి స్థానంలో ఉంటుంది. అంతే కాదు దొంగచాటుగా వేటాడటంలో కూడా దీనికి ఇదే చాటి. ఎరకు కనిపించకుండా నక్కి నక్కి వేటాడుతుంది చిరుత. ఆలా నక్కి నక్కి వేటాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video

Viral Video : క్రూరమృగాలు తమ కడుపు నింపుకునేందుకు సాధుజంతువులను వేటాడాలి.. అలాగే సాధుజంతువులు వాటి నుంచి తప్పించుకుని ఎలప్పుడూ తమను తాము కాపాడుకుంటూ ఉండాలి. ఆదమరిస్తే క్రూరమృగాలకు ఆహారంలా మిగిలిపోవడం ఖాయం. అయితే చాలా సాధుజంతువులు ప్రమాదాన్ని ముందు గుర్తించి పరుగుతీస్తుంటాయి. కానీ కొన్ని మాత్రం గుర్తించలేక క్రూరమృగాలకు ఆహారమవుతుటాయి.

అయితే వేటాడే జంతువుల్లో సింహం, పులి, చిరుతల గురించే మనం ఎక్కువగా చెప్పుకుంటాం. వాటి వీడియోలనే అధికంగా చూస్తుంటారం. మిగతా క్రూర జంతువులూ ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోము. అయితే క్రూరజంతువుల్లో అత్యంత వేగంగా వేటాడే జంతువు చిరుత. చిరుత గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తుంది. ఇక ఇది ఎక్కువగా జింకలను టార్గెట్ చేసి వేటాడుతుంది. సింహం, పులి లాగా చిరుత టీంతో వేటకు వెళ్ళదు. వన్ మ్యాన్ ఆర్మీలా ఉంటుంది. సింగిల్ గా వెళ్తుంది కాబట్టి పెద్ద జతువులను వేటాడడం కష్టం.. అందుకే ఇది గుంపులుగా ఉండే జింకలను టార్గెట్ చేసి వేటాడుతుంది.

అయితే జంతువులకు కనిపించకుండా వేటాడటంలో చిరుత మంచి సిద్దహస్తురాలు. నక్కి నక్కి వేటాడుతుంది. ఇలానే నక్కి నక్కి వేటాడిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని మరో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా రీ-ట్వీట్ చేస్తూ.. ”అడవిలో జీవనం సవాళ్లు, అనిశ్చితులతో కలిగి ఉంటుంది.. ఇది ఎరకు.. వేటగాడికి కూడా.. ” హ్యాష్‌ట్యాగ్‌ జంగిల్ లైఫ్ అని పేర్కొన్నాడు.

ఇక వైరల్ వీడియోలో.. ఓ జింక ప్రశాంతంగా గడ్డి మేస్తూ సేద తీరుతున్నట్లు మీరు చూడవచ్చు. అంతలో దూరం నుంచి చూసిన ఓ చిరుతపులి దాన్ని వేటాడేందుకు నక్కుతుంది. చెట్టు చాటును దాక్కుని అదును చూసి జింకపై మెరుపు దాడి చేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకింత షాక్‌కు గురయ్యారు. చిరుత వేట మాములుగా లేదుగా అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.