Viral Video
Viral Video: చోరీకి పాల్పడ్డాడంటూ ఓ యువకుడిని ట్రక్కు ముందు భాగంలో తాడుతో కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు కొందరు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్ లోని ముక్త్‌సర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఓ ప్రాంతంలో బాధిత యువకుడు ట్రక్కులో నుంచి రెండు బ్యాగుల గోధుమ బస్తాలను చోరీ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని పట్టుకున్న ట్రక్కు డ్రైవర్, ఇతరులు అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలని భావించారు. ఆ వాహన బోనెట్ కు తాడుతో నిందితుడిని కట్టేసి దాన్ని నడుపుతూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు.
నిందితుడిని తీసుకువస్తున్న సమయంలో వీడియోలు కూడా తీశారు. నిందితుడిని ట్రక్కుకు కట్టేసి వారు అలా తీసుకురావడం చూసి పోలీసులు కూడా షాకయ్యారు. ‘‘ఈ ఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. యువకుడు బియ్యం బస్తాలను చోరీ చేస్తోన్న వీడియో ఒకటి కాగా, నిందితుడిని టక్కుకు కట్టేసి తీసుకొచ్చిన వీడియో మరొకటి. ఆ ఘటనపై చర్యలు తీసుకుంటాము’’ అని ఆ ప్రాంత డీఎస్పీ మీడియాకు తెలిపారు.
Taliban way in Muktsar !!
Wheat thief tied in front of the truck #Muktsar #WheatThief pic.twitter.com/sQZkMG6wrg— Gagandeep Singh (@Gagan4344) December 11, 2022