Gujarat MLAs criminal cases : గుజరాత్‌లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులే .. ఎక్కువమంది బీజేపీ చెందినవారే..

గుజరాత్‌లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులే ..వీరిలో ఎక్కువమంది బీజేపీ చెందినవారే ఉండటం గమనించాల్సిన విషయం.

Gujarat MLAs criminal cases : గుజరాత్‌లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులే .. ఎక్కువమంది బీజేపీ చెందినవారే..

Gujarat MLAs criminal cases

Gujarat MLAs criminal cases : గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. బీజేపీ రికార్డు బ్రేక్ చేస్తూ ఘన విజయం సాధించింది. కానీ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో 40మంది నేరచరిత్ర ఉన్నవారేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన ల్లో విజయం సాధించిన 182 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది నేరచరితులేనని..ఎన్నికల అఫిడవిట్‌లో సదరు వ్యక్తులు దాఖలు చేసిన వివరాలను బట్టి ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ 40మందిలో ఎక్కుమంది బీజేపీకి చెందినవారే కావటం గమనించాల్సిన విషయం. ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈ నేరచరిత్ర కలిగినవారు కేబినెట్ లో మంత్రులు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

నేర చరిత్ర అంటే ఏదో చిన్న చిన్ ఆరోపణలు కాదు తీవ్ర నేరచరిత్ర ఉన్నవారు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించేటం దురదృష్టకరమనే చెప్పారలిజ నేరచరిత్ర కలిగిన ఈ 40 మంది ఎమ్మెల్యేల్లో 29 మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కొందరిపై అత్యాచారం, హత్య కేసులు కూడా ఉండడం గమనించాల్సిన విషయం. ఇంత తీవ్రమైన నేరారోపణలు కలిగిన వ్యక్తులు ప్రజాప్రతినిధులు సేవ చేసేయటానికి రాజకీయాల్లోకి వచ్చామని చెబుతుంటం గమనార్హం.

తీవ్రమైన నేరారోపణలు కలిగిన వారిలో అత్యధికంగా అంటే 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా..నలుగురు కాంగ్రెస్‌కు చెందినవారున్నారు. మరో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారుండగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ గా పోటీ చేసినవారున్నారు. అలాగే మరొకరు సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారున్నారు.

కాగా..గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 156 స్థానాల్లో విజయం సాధించింది. 26 మంది కాంగ్రెస్ 17 స్థానాల్లో విజయం సాధించగా 9 మంది, 5 స్థానాల్లో విజయం సాధించిన ‘ఆప్’కు చెందిన ఇద్దరిపై నేరారోపణలు ఉన్నట్టు ఏడీఆర్ గణాంకాలు చెబుతున్నాయి.

గత ఎన్నికల (2017)తో పోల్చుకుంటే మాత్రం నేర చరిత్ర కలిగిన ఎమ్మెల్యేల సంఖ్య కొంత తగ్గిందని అధ్యయనం తెలిపింది. అప్పుడు 47 మంది నేరచరితులు అసెంబ్లీకి ఎన్నికైతే ఇప్పుడు వారి సంఖ్య 40కి తగ్గింది. హత్యారోపణలు ఎదుర్కొంటున్న వారిలో వన్సదా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్, పటాన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైన పెనాల్ పటేల్, ఉనా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన కౌలుభాయ్ రాథోడ్‌ ఉన్నారు. వీరు మూడుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాగించటం గమనించాల్సిన విషయం.