Botcha Satyanarayana : ఇప్పుడే ఇలా ఉంటే వాళ్లు ప్రభుత్వంలోకి వస్తే ప్రజలు తట్టుకోగలరా?- కూటమిపై మంత్రి బొత్స ఫైర్

కూటమి ఒత్తిడికి తట్టుకోలేక, వారితో కుమ్మక్కై ఈసీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది.

Botcha Satyanarayana : రెగ్యులర్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ లబ్దిదారులకు చేరకుండా అడ్డుపడుతున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. వాలంటీర్లు పెన్షన్స్ ఇవ్వకపోవడం వల్ల 46 మంది వృద్ధులు చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద వృద్ధుల మరణానికి కూటమి పెద్దలే కారణం అని, వారి ఉసురు పోసుకుంటారని మంత్రి బొత్స అన్నారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

”డీబీటీ ద్వారా స్కీమ్స్ డబ్బులు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. దౌర్భాగ్యంగా పేద ప్రజలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వీరు ప్రభుత్వంలోకి వస్తే ప్రజలు తట్టుకోగలరా? 2019 ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ ఇచ్చారు. ఇప్పుడు మేం స్కీమ్స్ ఇస్తుంటే వద్దని ఆపుతున్నారు. కూటమిలో ఉంటే ఒకలా, లేకపోతే మరొకలా నడుస్తుంది. ఈసీకి మా ఆక్షేపణ, నిరసన తెలియజేస్తున్నాం. ఫిర్యాదులు వస్తే అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో ఈసీ చూడాలి. చంద్రబాబును భగవంతుడు కూడా క్షమించడు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ ను బూచిగా చూపి విషప్రచారం చేస్తున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు పవర్ వచ్చింది. మీ ఇంట్లో నాలుగు పదవులు లేవా? మీరేమైనా దైవాంశ సంభూతులా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను ఎంపీ, నా భార్య జడ్పీ చైర్మన్.

కోర్టు ఆర్డర్ ఇచ్చాక కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు. ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కూటమి ఒత్తిడికి తట్టుకోలేక, వారితో కుమ్మక్కై ఈసీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ పై పత్రికల్లో ఇస్తున్న ప్రకటనలపై కేసు నమోదు చేయాలి. విశాఖ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఏమైంది? పురంధేశ్వరి బంధువులు చేసిన డ్రగ్స్ సరఫరా ఎందుకు దారి మళ్లించారు? అని మంత్రి బొత్స ప్రశ్నించారు.

Also Read : ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు