Mobile Recharge : రీఛార్జ్ ఫెయిల్! డబ్బులు కట్ అయ్యాయా? డోంట్ వర్రీ.. RBI రూల్స్‌తో వెంటనే రిఫండ్.. ఇలా చేయండి!

Mobile Recharge : చాలావరకు యూపీఐ యాప్‌లు పేమెంట్ సమస్యలను 24 గంటలలోపు ఆటోమాటిక్ పరిష్కరిస్తాయి. మీ ఫిర్యాదుకు (acknowledgment number) అందితే.. యాప్‌లోని హెల్ప్, సపోర్టు ద్వారా ట్రాక్ చేయొచ్చు.

Mobile Recharge failed

  • మొబైల్ రీఛార్జ్ ఫెయిల్.. డబ్బుల్ కట్ అయ్యాయా?
  • రీఫండ్ అయ్యే టైమ్ ఇంకా ఆలస్యమవుతోందా?
  • ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? కస్టమర్లు ఏం చేయాలి?

Mobile Recharge : మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ ట్రై చేశారా? డబ్బులు కట్ అయ్యాయి.. కానీ, రీఛార్జ్ పూర్తి కాలేదా? యూపీఐ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసే సమయంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్.. ప్రతిరోజూ లక్షలాది మంది యూజర్లు యూపీఐ ఆధారిత యాప్‌లతో ప్రీపెయిడ్ మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేస్తుంటారు.

డబ్బు కట్ అయి రీఛార్జ్ ఫెయిల్ కావడం కామన్ కంప్లయింట్. మీ మొబైల్ రీఛార్జ్ ఫెయిల్ అయి ఖాతా నుంచి డబ్బు కట్ అయితే వెంటనే కొన్ని పద్ధతులను పాటిస్తే మీ డబ్బులు రీఫండ్ అవుతాయి. ఒకవేళ మీకు రావాల్సిన రీఫండ్ అమౌంట్ ఆలస్యమైతే ఎలా పొందాలో ఈ సింపుల్ టిప్స్ తప్పక తెలుసుకోండి.

డబ్బులు కట్.. రీఛార్జ్ ఫెయిల్ అయిందా? :
దేశీయ యూపీఐ నెట్‌వర్క్ నెలకు 19 బిలియన్లకు పైగా పేమెంట్లు లేదా రోజుకు సుమారు 600 నుంచి 700 మిలియన్ల పేమెంట్లను ప్రాసెస్ చేస్తుంది. చిన్న సర్వర్ టెక్నికల్ లోపం లేదా కనెక్టివిటీ అంతరాయం కూడా టెంపరరీ ఫెయిల్యూర్ కారణం కావచ్చు.

సాంకేతిక లోపాలు, కమ్యూనికేషన్ వైఫల్యాలు, టైమ్-అవుట్‌లు లేదా ఫండ్స్ డిపాజిట్ లేకపోవడం వంటివి కస్టమర్ ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు డబ్బులు కట్ అవుతాయి. కానీ, పేమెంట్ పూర్తి కాదు. తద్వారా ఫెయిల్యూర్ అవుతుంది.

Read ALso : Affordable 7-Seater Cars : లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ. 10 లక్షల్లోనే ఫుల్ ప్యాకేజ్ 7-సీటర్ కార్లు.. ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్!

రీఛార్జ్ ఫెయిలైతే ఫస్ట్ ఇలా చేయండి :
మీ రీఛార్జ్ ఫెయిల్ అయితే వెంటనే మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయొద్దు. మీ పేమెంట్ వివరాలను చెక్ చేయండి. నిజంగా డబ్బు కట్ అయిందో లేదో మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ నుంచి వచ్చిన SMS చెక్ చేయండి. ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, సమయం అమౌంట్ చెక్ చేయండి. ఈ సమాచారం మీ ప్రూఫ్ గా చూపించొచ్చు.

యూనిఫైడ్ డిస్ప్యూట్ అండ్ ఇష్యూ రిజల్యూషన్ (UDIR) అనే సిస్టమ్ NPCI ప్రవేశపెట్టింది. ఇప్పుడు చాలా యాప్‌లు రియల్ టైమ్ నేరుగా బ్యాంక్ సర్వర్‌తో పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తాయి. మీ పేమెంట్ యాప్‌లో ‘Check Status’పై ట్యాప్ చేయగానే UDIR సిస్టమ్ తక్షణమే అమౌంట్ రీఫండ్ చేస్తుంది.

కస్టమర్ల రీఫండ్ రైట్స్ ఇవే :
ఈ రూల్స్ చాలా మంది కస్టమర్లకు తెలియదు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే ట్రాన్సాక్షన్ల విషయంలో మొదటి వర్కింగ్ డేలోగా రీఫండ్‌ పూర్త కావాలి. రీఛార్జ్‌లతో సహా వ్యక్తి నుంచి మర్చంట్ చేసే పేమెంట్ల విషయంలో గడువు 5 వర్కింగ్ డేస్ టైమ్ ఉంటుంది.

ఒకవేళ మీ బ్యాంకు ఈ వ్యవధిలోగా రీఫండ్ ఇవ్వకపోతే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఆలస్యమైన ప్రతి రోజుకు నష్టపరిహారంగా రోజుకు రూ. 100 చొప్పున ఆటోమాటిక్‌గా బ్యాంకులు చెల్లించాలి. మీ బ్యాంకుకు ఫిర్యాదు చేసేటప్పుడు ఆర్‌బీఐ సర్క్యులర్ గురించి కూడా అటాచ్ చేయండి.

రీఫండ్ రాకుంటే ఏం చేయాలి? :

  • మీ యూపీఐ యాప్‌ ఓపెన్ చేయండి.
  • మీ పూర్తి పేమెంట్ హిస్టరీని చెక్ చేయండి.
  • నేరుగా మీ బ్యాంకుకు లింక్ అయి ఉంటుంది.
  • చాలా యాప్‌లు 24 గంటలలోపు ఆటోమాటిక్ రీఫండ్ చేస్తాయి.
  • మీ ఫిర్యాదుకు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తుంది.
  • యాప్‌లోని హెల్ప్ లేదా సపోర్టు సెక్షన్ కింద ట్రాక్ చేయండి.
  • మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి పేమెంట్ ఐడీని ఎంటర్ చేయండి.
  • 5 వర్కింగ్ డేస్ తర్వాత కూడా డబ్బులు రాకుండా NPCIలో కంప్లయింట్ చేయండి.
  • NPCI వ్యక్తిగత రీఫండ్‌లను నేరుగా పరిష్కరించదు.
  • బ్యాంకులు ఆలస్యం చేస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది.
  • ఆర్బీఐ, సీఎంఎస్ పోర్టల్ ద్వారా ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయండి.

డబ్బులు కట్ అయి రీఛార్జ్ ఫెయిల్ అయితే టెన్షన్ పడటం కామన్.. అందుకే ఈ సిస్టమ్ మీకు డబ్బులను రీఫండ్ చేస్తుంది. టైమ్ ఎంత పడుతుందో తెలుసుకోండి. మీ ట్రాన్సాక్షన్ ఐడీని సేవ్ చేసుకోండి. చాలా వరకు రీఫండ్‌లు ఆటోమేటిక్‌గా వస్తాయి.