OnePlus Pad Discount : కొత్త టాబ్లెట్ కొంటున్నారా? వన్‌ప్లస్ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

OnePlus Pad Discount : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ ప్యాడ్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్‌పై ఏకంగా రూ. 6వేల తగ్గింపు పొందవచ్చు.

OnePlus Pad gets Rs 6k discount on Amazon

OnePlus Pad Discount : కొత్త టాబ్లెట్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ ప్యాడ్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ వన్‌ప్లస్ ట్యాబ్‌పై ఏకంగా రూ. 6వేల తగ్గింపు పొందవచ్చు. వాస్తవానికి వన్‌ప్లస్ ట్యాబ్ ధర రూ.37,999కి లాంచ్ అయింది. కానీ, ఈ టాబ్లెట్ ఇప్పుడు రూ.31,990కి అందుబాటులో ఉంది. రూ. 30వేల పరిధిలో ఆండ్రాయిడ్ టాబ్లెట్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇదే సరైన అవకాశం అని చెప్పవచ్చు.

Read Also : Upcoming Phones 2024 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రాబోయే 5 సరికొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ప్రస్తుతానికి, ఈ వన్‌ప్లస్ ప్యాడ్ డీల్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అయితే, అమెజాన్ దీపావళి సేల్ ముగిసే వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ సేల్ లైవ్‌లో ఉన్నప్పుడు అమెజాన్ డీల్ ధరలను పెంచదు. ఈ సేల్ ఈవెంట్ చివరి తేదీని కంపెనీ వెల్లడించలేదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గత విక్రయాలను పరిశీలిస్తే.. ఇది ఒక నెల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ ప్యాడ్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ ప్యాడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. కార్టెక్స్-ఎక్స్2 కోర్ 3.05GHz కలిగిన ఫస్ట్ మొబైల్ చిప్. ఈ చిప్‌సెట్ 12జీబీ ర్యామ్‌తో వస్తుంది. ర్యామ్-విటా (ర్యామ్ విస్తరణ) టెక్నాలజీకి సపోర్టు అందిస్తుంది. టాబ్లెట్ 11.6-అంగుళాల 2.8కె (2800×2000 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ డిస్‌ప్లేతో 144Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్ 10+తో వస్తుంది. డిస్‌ప్లే డాల్బీ విజన్‌కి సపోర్ట్‌ను కలిగి ఉంది. అయితే, స్పీకర్‌లు రిచ్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం డాల్బీ అట్మోస్ సపోర్టును అందిస్తుంది.

టాబ్లెట్‌లో సన్నని బెజెల్స్, ఎడ్జ్ దగ్గర కర్వ్ ఉంటుంది. పాపులర్ ఐప్యాడ్, షావోమీ ప్యాడ్ 5 టాబ్లెట్‌ల మాదిరిగా కాకుండా ఆకర్షణీయమైన ఎడ్జ్‌లను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాక్ ప్యానెల్ 13ఎంపీ ప్రైమరీ కెమెరా టాప్-సెంట్రల్‌గా కెమెరా కటౌట్ లోపల ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. చాలా మిడ్-బడ్జెట్ టాబ్లెట్‌లకు మించి అదనపు ఫీచర్లతో వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్ వన్‌ప్లస్ స్టయిలో మాగ్నెటిక్ కీబోర్డ్ సపోర్టు అందిస్తుంది. టాబ్లెట్ 67డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్ టెక్‌తో 9,500mAh బ్యాటరీతో వస్తుంది. దిగువన ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ కూడా ఉంది.

Read Also : iPhone 16 vs iPhone 17 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 కొంటే బెటరా? ఐఫోన్ 17 కోసం వేచి ఉండాలా?