Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..

క్యూట్ వీడియోలు చాలానే చూసుంటాం. కానీ, వీటన్నిటికంటే ఇది ప్రత్యేకమైన వీడియో. పాండా నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నిస్తోన్న వీడియో కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ప్రతిసారీ కిందపడుతున్నా.. ఎక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

Cute Emoji

Panda climbing Video: క్యూట్ వీడియోలు చాలానే చూసుంటాం. కానీ, వీటన్నిటికంటే ఇది ప్రత్యేకమైన వీడియో. పాండా నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నిస్తోన్న వీడియో కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. ప్రతిసారీ కిందపడుతున్నా.. ఎక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

వైరల్ అవుతున్న వీడియోను బ్యూటెంగేబిడెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 29 సెకన్ల క్లిప్‌లో, పాండా నిచ్చెన ఎక్కుతున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. పాండా చిలిపి చేష్టలు.. అంతగా అలరిస్తుంది మరి.

ఆన్‌లైన్‌లో షేర్ చేశాక.. వీడియోను 18 వేలకు మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు తమ రియాక్షన్‌లతో కామెంట్స్ చేస్తున్నారు. “రోజును ప్రారంభించడానికి నేను ఇలానే ప్రయత్నం చేస్తా” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు, “ఈ జంతువులు అడవిలో ఎలా జీవించగలవని ఎవరైనా ఒకసారి అడగలేదా?” అని వెల్లడించారు.

Read Also : పిల్లిని ముద్దులతో మంచెత్తిన చిన్నారి.. క్యూట్ వీడియో వైరల్..!