వాడుకోవడంలో వావి వరసలు లేనోడే వర్మ.. ఆసక్తికరంగా ‘పరాన్నజీవి’ టీజర్..

  • Publish Date - July 23, 2020 / 07:24 PM IST

ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సినిమాల రూపంలో పోటీ క్రియేట్ అయ్యింది. పవన్‌ను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ ‘పవర్‌స్టార్’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ విడుదల చేసి వివాదం మరింత ముదిరేలా చేశాడు వర్మ. ‘పవర్‌స్టార్’ ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే పవన్ అభిమానులు నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్‌కు సపోర్ట్‌గా రూపొందుతోన్న ‘పరాన్నజీవి’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇందులో రామ్ గోపాల్ వర్మ పాత్రలో కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు. ఈ సాయంత్రం ‘పరాన్నజీవి’ టీజర్ ఘనంగా.. పూర్తి ఉచితంగా విడుదల చేస్తున్నాం.. అంటూ మూవీ టీమ్ టీజర్ ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేసింది.

ట్రైలర్లో వర్మ పాత్రధారి షకలక శంకర్ తన గురించి తాను ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం చూపించారు.. ‘‘వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య.. లక్ష్మీబాంబ్‌తో బాబా గారినే బదనాం చేశాను..శివంగి శ్రీరెడ్డిని సినిమా స్టార్లపై సివాలెత్తేలా చేశాను..కత్తి మహేష్‌ని కత్తి దూసేలా చేశాను..స్క్రిప్ట్ నాది స్క్రీన్‌ప్లే నాది..ఫైటింగ్ వాళ్లది చీటింగ్ నాది..వాడుకోవడంలో వాయీ వరసలు లేవు..వోడ్కా నా పెగ్గులోకి రావాలి, ఫిగర్ నా పక్కలోకి రావాలి’’.. అంటూ తానెంత వరెస్టో వర్మ క్యారెక్టర్ చెప్పుకోవడం చూపించారు. జూలై 25న ‘పరాన్నజీవి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.