russia ukraine tortured prisoners of war says un Human rights office
Ukraine-Russia war: ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద రష్యా.. అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులతో పాటు పలు ఆయుధాలను మోహరించింది. ఉక్రెయిన్ క్షిపణి దాడులు చేయడంతో రష్యా సైనికులు ఇటీవల పెద్ద ఎత్తున మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో రష్యా మరిన్ని భీకరదాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌక రష్యాలోని ఓ పోర్టు నుంచి ఉక్రెయిన్ సరిహద్దులు ఉండే సముద్రతలం వైపునకు బయలుదేరింది.
నౌకా దళ కమాండర్, రక్షణ మంత్రి సెర్గేయీ షోయిగూతో రష్యా అధ్యక్షుడు పుతిన్ నిన్న ఆయా విషయాలపై పలు ఆదేశాలు ఇచ్చారు. అడ్మిరల్ గోర్ష్కోవ్ యుద్ధనౌకలోనే అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులు, దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు ఉన్నాయి. ధ్వనివేగం కన్నా అవి 5 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లి దాడులు చేస్తాయి. వాటిని గుర్తించి తిప్పి కొట్టడం క్లిష్టతరం.
ఇటువంటి ఆయుధాలు రష్యాను కాపాడతాయని పుతిన్ అన్నారు. బయటి నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కొంటాయని చెప్పారు. రష్యా ప్రయోజనాలను కాపాడుకోవడంలో అవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు. రష్యా అత్యాధునిక జిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణులను 2021లో పరీక్షించింది. ఆ ప్రయోగం విజయవంతమైందని అప్పట్లో ప్రకటించింది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిందని చెప్పింది.
Maharashtra: ఉద్ధవ్‌కు కౌంటర్ ఇవ్వడం కోసం బీజేపీ వ్యతిరేకితో చేతులు కలిపిన షిండే