Supreme Court
Supreme Court planning to live stream all of its hearings: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా రూపొందించిన సాప్ట్ వేర్ తో ప్రయోగాత్మక పరిశీలన చేయనుంది. లోటుపాట్లు సవరించి.. త్వరలోనే అధికారికంగా సుప్రీంకోర్టులోని అన్ని బెంచ్ లలో వాదనలు, తీర్పులు ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా అందుబాటులోకి తీసుకురానుంది. అయితే, ఇవాళ ఒక టెస్ట్ ఫార్మాట్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. యూట్యూబ్ ఛానెల్ కు బదులుగా కోర్టుకు చెందిన సొంత అప్లికేషన్ పై ప్రత్యక్ష ప్రసారం జరిగింది.
2022 నుంచి రాజ్యాంగ ధర్మాసనం ప్రజా ప్రాముఖ్యత కలిగిన విచారణలు, తీర్పులు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించిన మొదటి రోజున ఎనిమిది లక్షల మంది వీక్షించారు. ఇటీవల NEET-UG విషయంలో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారణలు, ఆర్జీ కర్ సుమోటో కేసు కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెలిసిందే.