Radhika merchant: అంబానీ చిన్న కోడలు బర్త్ డే వేడుకలు అదుర్స్.. సినీ, క్రీడా ప్రముఖులు సందడి.. వీడియోలు వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్నకోడలు రాధికా మర్చంట్ పుట్టిన రోజు వేడుకలు ముంబయిలో ఘనంగా జరిగాయి.

Radhika Merchant birthday party
Radhika Merchant birthday party Video Goes Viral: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్నకోడలు రాధికా మర్చంట్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముంబయిలో జరిగిన ఈ బర్త్ డే వేడుకల్లో సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంత్ అంబానీనీ వివాహం చేసుకున్న తరువాత రాధికా మర్చంట్ కు తొలి బర్త్ డే ఇదే. దీంతో ముఖేశ్ అంబానీ, నీతా అంబానీతోపాటు ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ బర్త్ డే వేడుకల్లో రాధికా మర్చంట్ తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా పాల్గొన్నారు. రాధికా మర్చంట్ కేక్ కట్ చేసి తొలుత తన భర్త అనంత్ అంబానీకి అందించారు. ఆ తరువాత ముకేశ్ అంబానీకి అందించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు కేక్ అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతోపాటు. ముఖ్యఅతిథులు రాధికా మర్చంట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పుట్టిన రోజు వేడుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతోపాటు బాలీవుడ్ ప్రముఖులు రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఓరీ ఇన్ స్టా వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Veekshanam : ‘వీక్షణం’ మూవీ రివ్యూ.. థ్రిల్లర్ తో అదరగొట్టారుగా..
ఈ ఏడాది జులైలో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికాకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలో ప్రపంచ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
View this post on Instagram
View this post on Instagram