IND vs NZ : బెంగ‌ళూరులో మ్యాచ్ అంటే చాలు.. ర‌చిన్ ర‌వీంద్ర బాదుడే బాదుడు.. రికార్డు సెంచ‌రీ.. 12 ఏళ్ల త‌రువాత‌

బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర శ‌త‌కంతో మెరిశాడు.

IND vs NZ : బెంగ‌ళూరులో మ్యాచ్ అంటే చాలు.. ర‌చిన్ ర‌వీంద్ర బాదుడే బాదుడు.. రికార్డు సెంచ‌రీ.. 12 ఏళ్ల త‌రువాత‌

Rachin Ravindra century

Updated On : October 18, 2024 / 12:56 PM IST

IND vs NZ : బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర శ‌త‌కంతో మెరిశాడు. 123 బంతులు ఎదుర్కొన్న అత‌డు 11 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అత‌డికి ఇది రెండో శ‌త‌కం. ఈ క్ర‌మంలో అత‌డు అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. 12 సంవ‌త్స‌రాల త‌రువాత భార‌త గ‌డ్డ‌పై టెస్టుల్లో సెంచ‌రీ చేసిన మొద‌టి కివీస్ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

2013లో బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో రాస్‌టేల‌ర్ (113) సెంచ‌రీ బాదాడు. ఆ త‌రువాత మ‌రే కివీస్ ఆట‌గాడు సుదీర్ఘ ఫార్మాట్‌లో భార‌త గ‌డ్డ‌పై సెంచ‌రీ చేయ‌లేదు.

IND vs NZ : ఇంట‌ర్ ఎగ్జామ్స్ కార‌ణంగా న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం

బెంగ‌ళూరు అంటే రెచ్చిపోతాడు.

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం అంటే చాలు ర‌చిన్ ర‌వీంద్ర రెచ్చిపోతాడు. ఇంత‌క ముందు ఈ స్టేడియంలో రెండు వ‌న్డేలు ఆడ‌గా ఓ సెంచ‌రీ చేశాడు. ఓ టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఇక ఇక్క‌డ తాను ఆడుతున్న తొలి టెస్టులోనూ శ‌త‌కంతో స‌త్తా చాటాడు.

ర‌చిన్ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు లంచ్ విరామానికి న్యూజిలాండ్ ఏడు వికెట్లు కోల్పోయి 345 ప‌రుగులు చేసింది. ర‌చిన్ ర‌వీంద్ర (104), టిమ్ సౌధీ (49) లు క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 299 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. కాగా.. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే.

Asia Cup 2024 : శ‌నివారం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?