Asia Cup 2024 : శనివారం భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్ధమైంది.

India A vs Pakistan A in ACC Mens T20 Emerging Teams Asia Cup 2024
Asia Cup 2024 : ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో సత్తా చాటేందుకు భారత జట్టు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు దాయాది పాకిస్థాన్-ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ శనివారం (అక్టోబర్ 19న) ఒమన్‌లోని మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని గెలుపుతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
తిలక్ వర్మ సారథ్యంలో ఇండియా-ఏ జట్టు బరిలోకి దిగనుంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, రమన్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా వంటి ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. ఇక పాక్ విషయానికి వస్తే.. మహ్మద్ హ్యారీస్ నాయకత్వంలో ఆడనుంది. గతేడాది అతడి నాయకత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
IND vs NZ : ఇంటర్ ఎగ్జామ్స్ కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ప్లేయర్ దూరం
ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక లు ఉన్నాయి. ఇక గ్రూప్-బిలో ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. అక్టోబర్ 25న సెమీ ఫైనల్ మ్యాచులు, అక్టోబర్ 27న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ మ్యాచ్‌లను మన దేశంలో స్టార్‌స్పోర్ట్స్ 1 ఛానెల్‌లో చూడొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. డిస్నీ+హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు.
Rishabh Pant: రిషబ్ పంత్ కాలుకు గాయం.. తొలి టెస్టుకు దూరంమైనట్లేనా..?
భారత్ ఎ జట్టు : తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా సలాం, సాయి కిషోర్, రాహుల్ చాహర్