Rishabh Pant: రిషబ్ పంత్ కాలుకు గాయం.. తొలి టెస్టుకు దూరంమైనట్లేనా..?

న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది. అసలే తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో కష్టాల్లో పడిన టీమిండియాకు ..

Rishabh Pant: రిషబ్ పంత్ కాలుకు గాయం.. తొలి టెస్టుకు దూరంమైనట్లేనా..?

Rishabh Pant

Updated On : October 18, 2024 / 7:57 AM IST

IND vs NZ Test Match Rishabh Pant Injury : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ గురువారం మొదలైంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దుకాగా.. గురువారం ఉదయం మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కేవలం 46 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఐదుగురు కీలక బ్యాటర్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. టీమిండియా టాప్-8 బ్యాటర్లలో అయిదుగురు డకౌట్ కావటం ఇదే మొదటిసారి. ప్రపంచ క్రికెట్లో రెండోసారి. 1888లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాప్ -8 బ్యాటర్లలో అయిదుగురు అలాగే డకౌట్ అయ్యారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు నష్టపోయిన 180 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (22), డరిల్ మిచెల్ (14) బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: IND vs NZ : తొలి టెస్టులో ప‌ట్టుబిగించిన న్యూజిలాండ్‌.. తృటిలో చేజారిన డేవాన్ కాన్వే శ‌త‌కం..

న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది. అసలే తొలి ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శనతో కష్టాల్లో పడిన టీమిండియాకు పంత్ గాయంతో భారత్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వికెట్ కీపింగ్ చేస్తుండగా పంత్ గాయపడ్డాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్ చివరి బంతి తక్కువ ఎత్తులో వచ్చి పంత్ కుడి మోకాలికి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడిన పంత్ మైదానంలో కూలబడ్డాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ ను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. మైదానం నుంచి వెళ్లే క్రమంలో పంత్ కుంటుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత ధ్రువ్ జూరెల్ వికెట్ కీపింగ్ చేశాడు.

Also Read: IND vs NZ : 13, 2, 0, 0, 20, 0, 0, 0, 2, 1, 4*.. ఫోన్ నంబ‌ర్ కాదురా అయ్యా.. టీమ్ఇండియా స్కోర్ కార్డు..

గత రెండేళ్ల క్రితం రోడ్డు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సంవత్సరం పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. క్రమంగా అతను కోలుకొని తిరిగి జాతీయ జట్టులో అడుగు పెట్టాడు. బంగ్లాదేశ్ తో టెస్టుల్లోనే అతను సుదీర్ఘ ఫార్మాట్లో పునరాగమనం చేశాడు. పంత్ కు కారు ప్రమాదంలో తీవ్రగాయమైన కాలుకే ప్రస్తుతం బాల్ తగిలి గాయపడ్డాడు. దీంతో అతను కుంటుకుంటూ మైదానంను వీడాల్సి వచ్చింది. గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే, అతను ఇవాళ మ్యాచ్ కోసం మైదానంలోకి దిగే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు. మొదటి టెస్టు మొత్తానికి పంత్ దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పంత్ గాయంపై ఇంకా అధికారిక సమాచారం లేదు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వచ్చి వికెట్లు కీపింగ్ చేస్తున్నాడు. ఇవాళ మ్యాచ్ లో పంత్ రంగంలోకి దిగుతారని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లలో రిషబ్ పంత్ దే (20 పరుగులు) అత్యధిక స్కోర్.