Chief Dating Officer
Chief Dating Officer : మీకు ఉద్యోగం కావాలా నాయనా.. మా దగ్గర ఉద్యోగం ఉంది. కానీ, మాకు కొన్ని అర్హతలు అవసరం.. ప్రేమించే వ్యక్తి కావాలి. ప్రేమగా మాట్లాడగలగాలి.. ప్రేమను పంచగలగాలి. ప్రేమ పాఠాలు చెప్పగలగాలి. డేటింగ్ చేయడంలో దిట్ట అయి ఉండాలి. మోడ్రాన్ డేటింగ్ కల్చర్ గురించి బాగా అవగాహన కలిగి ఉండాలి. దరఖాస్తుదారులకు బ్రేకప్, డేటింగ్ యాప్ అనుభవం కూడా తప్పక ఉండాలంట..
ఇలాంటి అనుభవం కలిగిన వ్యక్తి కోసం బెంగళూరుకు చెందిన మెంటరింగ్, కన్సల్టింగ్ ప్లాట్‌ఫారమ్, టాప్‌మేట్ కంపెనీ వెతుకుతుందట.. పైగా ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లే దరఖాస్తు చేసుకోవాలంటూ ఒక విచిత్రమైన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో చీఫ్ డేటింగ్ ఆఫీసర్ (CDO) కావాలంటూ జాబ్ పోస్ట్ చేసింది. చాలా హాస్యాస్పదంగా ఉన్న ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ అవసరమా అంటే అది కాదు.. హై లేవల్ కార్పొరేట్ జాబ్ కూడా కాదు. ప్రేమ భాషలో నిష్ణాతుల కోసం కంపెనీ వెతుకుతోంది. ఆధునిక డేటింగ్, హార్ట్‌బ్రేక్, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న డేటింగ్ యాప్‌ల ప్రపంచాన్ని అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని కోరుతోంది.
“మీరు డేటింగ్ సలహా కోరే స్నేహితులా? మేం డేటింగ్ సంస్కృతిని తెలిసిన వారిని నియమించుకుంటున్నాం. ‘గోస్టింగ్,’ ‘బ్రెడ్ క్రంబింగ్’ పుస్తకంలోని ప్రతి కొత్త డేటింగ్ బజ్‌వర్డ్‌ను డీకోడ్ చేయగల స్వీయ-ప్రకటిత మ్యాచ్ మేకర్? సరే, మేం ఇప్పుడే స్వైప్ చేశాం” అని జాబ్ లిస్టింగ్‌లో టాప్‌మేట్‌లో మార్కెటింగ్ లీడ్ నిమిషా చందా రాసుకొచ్చారు.
ఆ జాబ్‌కు అసాధారణమైన రిక్వైర్‌మెంట్స్ ఉండాలంట :
కనీసం ఒకసారి అయినా బ్రేకప్ అయి ఉండాలి, రెండు సిట్యుయేషన్‌షిప్స్, మూడు డేటింగ్స్ (రసీదులు అవసరం లేదు, కానీ స్టోరీలను చెక్ చేస్తాం)
డేటింగ్ ట్రెండ్‌ల గురించి లోతైన జ్ఞానం, కొత్త వాటిని రూపొందించే క్రియేటివిటీ
కనీసం 2-3 డేటింగ్ యాప్‌లలో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ (క్షమించండి, క్యాట్‌ఫిషర్లు వర్తించాల్సిన అవసరం లేదు)
ఈ క్వాలిఫికేషన్స్ కలిగిన దరఖాస్తుదారులు ఎవరైనా సరే టాప్‌మేట్‌కు ఇష్టమైన దరఖాస్తుదారులు ‘డేట్స్’ అందుకుంటారు. అంటూ ఉద్యోగ జాబితా పోస్ట్‌స్క్రిప్ట్ కనిపిస్తోంది. ఈ పోస్టుపై స్పందించిన
వినియోగదారులు చాలా చెప్పాలి. చాలా మంది వినియోగదారులు ఇప్పటికే చీఫ్ డేటింగ్ ఆఫీసర్‌గా తమ నియామకాన్ని వ్యక్తపరిచారు. ఇంతకీ, టాప్‌మేట్ తమ ఉద్యోగానికి సరైన వారిని నిజంగా కనుగొంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.