Affordable 7-Seater Cars : లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ. 10 లక్షల్లోనే ఫుల్ ప్యాకేజ్ 7-సీటర్ కార్లు.. ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్!
Affordable 7-Seater Cars : భారత మార్కెట్లో ఫ్యామిలీ కస్టమర్ల కోసం రూ. 10 లక్షల లోపు ధరలో అద్భుతమైన 7-సీటర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో బొలెరో నియో వంటి కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఓసారి 7 సీటర్ కార్ల లిస్టుపై లుక్కేయండి..
- Sreehari A
- Published on- June 7, 2026 / 06:02 PM IST
Affordable 7-Seater Cars
- ఫ్యామిలీ కస్టమర్ల కోసం రూ. 10లోపు 7 సీటర్ కార్లు ఇవే
- క్యాబిన్ స్పేస్, 3 వరుస సీట్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు
- మారుతి సుజుకి ఎర్టిగా రూ. 8.80 లక్షల నుంచి ప్రారంభం
Affordable 7-Seater Cars : కొత్త కారు కొంటున్నారా? ఫ్యామిలీ కస్టమర్ల కోసం భారత మార్కెట్లో అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఫ్యామిలీ కస్టమర్లు లాంగ్ జర్నీలకు ఎక్కువ సీటింగ్, లగేజీ స్పేస్ ఉండే కార్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు.
7-సీటర్ కారు కొనేందుకు భారీ బడ్జెట్ అవసరం లేదు. ఫీచర్లు, విశాలమైన స్పేస్, పవర్ ఫుల్ ఇంజన్ (Affordable 7-Seater Cars) వంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు ధరలో మీకు నచ్చిన 7 సీటర్ కారు ఇంటికి తెచ్చుకోవచ్చు. పూర్తి కార్ల జాబితాపై ఓసారి లుక్కేయండి..
మారుతి సుజుకి ఎర్టిగా :
ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో పాపులర్ ఎంపీవీ మారుతి సుజుకి ఎర్టిగా ఒకటి. విశాలమైన క్యాబిన్, అద్భుతమైన మైలేజ్, తక్కువ మెయింటెన్స్ ఖర్చుల కారణంగా ఈ ఎంపీవీ ఫ్యామిలీ కస్టమర్లకు ఫేవరెట్ కారుగా మారింది.
నగరంలో లేదా హైవేపై ఎర్టిగా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అందిస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ధరలు రూ. 8.80 లక్షల నుంచి ప్రారంభమై రూ. 12.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటాయి.
Read Also : Realme X3 SuperZoom : ఒకప్పుడు ప్రీమియం ఫోన్.. ఇప్పుడు రూ.14 వేలకే! రియల్‌మి X3 సూపర్ జూమ్‌పై బంపర్ ఆఫర్
మహీంద్రా బొలెరో :
మీరు స్ట్రాంగ్ బాడీ, మంచి పెర్ఫార్మెన్స్ అందించే కారు కోసం చూస్తుంటే మహీంద్రా బొలెరో అద్భుతమైన ఆప్షన్. భారత మార్కెట్లో బొలెరో, గ్రామీణ ప్రాంతాలు, చిన్న నగరాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. మహీంద్రా బొలెరో ధరలు (ఎక్స్-షోరూమ్) సుమారుగా రూ. 8.00 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.90 లక్షల వరకు ఉంటాయి.
మహీంద్రా బొలెరో నియో :
మహీంద్రా బొలెరో నియో పాపులర్ 7-సీటర్ కారు. అద్భుతమైన డిజైన్ ట్రెడిషనల్ బొలెరో కన్నా మోడ్రాన్ లుక్ కనిపిస్తుంది. డ్రైవింగ్ చాలా కంపర్ట్ ఉంటుంది. అందుకే యూత్ ఎక్కువగా ఇష్టపడుతోంది. భారత మార్కెట్లో మహీంద్రా బొలెరో నియో ధర రూ. 8.85 లక్షల నుంచి రూ.10.49 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.
ఇవి తప్పక గుర్తుంచుకోండి :
ధరను బట్టి ఎప్పుడూ కారు కొనొద్దు. ఏదైనా కారు కొనేటప్పుడు క్యాబిన్ స్పేస్, 3 వరుస సీట్లు, మైలేజ్, సేఫ్టీ ఫీచర్లు, సర్వీస్ సపోర్ట్ వంటివి చూడాలి. మీ ఫ్యామిలీతో ఎక్కువగా లాంగ్ జర్నీలు చేస్తుంటే కంపర్ట్ సీటింగ్, తగినంత లగేజీ స్పేస్ ఉండే కార్లు తీసుకోవాలి.
