Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ముంబై పై ఒకే ఒక ఆట‌గాడు..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Virat Kohli creates history becomes first player to score 1000 runs against Mumbai Indians (pic credit@IPL)

  • ఐపీఎల్‌లో ముంబై పై కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌
  • ఎంఐ పై 1000 ప‌రుగులు చేసిన తొలి ఆట‌గాడు

Virat Kohli : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ పై 1000 ప‌రుగులు చేసిన తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఆదివారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 20 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఇక ముంబై అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో 21 ఇన్నింగ్స్‌లలో 977 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు.

ముంబై ఇండియ‌న్స్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 36 ఇన్నింగ్స్‌లలో 1030 పరుగులు
* కేఎల్ రాహుల్ – 21 ఇన్నింగ్స్‌లలో 977 పరుగులు
* శిఖర్ ధావన్ – 28 ఇన్నింగ్స్‌లలో 901 పరుగులు
* అజింక్య రహానే -29 ఇన్నింగ్స్‌లలో 888 పరుగులు
* సురేష్ రైనా – 36 ఇన్నింగ్స్‌లలో 850 పరుగులు

ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ (50; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ముంబై ఇండియ‌న్స్ పై కోహ్లీకి (Virat Kohli) ఇది ఏడో అర్థ‌శ‌త‌కం. ఈ క్ర‌మంలో ముంబై పై అత్య‌ధిక సార్లు 50+ స్కోర్లు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో సురేశ్ రైనా, డేవిడ్ వార్న‌ర్‌ల‌తో క‌లిసి కోహ్లీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు.

ఐపీఎల్‌లో ముంబై పై అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* కేఎల్ రాహుల్ – 9 సార్లు
* సురేశ్‌ రైనా – 7 సార్లు
* డేవిడ్ వార్నర్ – 7 సార్లు
* విరాట్ కోహ్లీ – 7 సార్లు