Gavaskar: కోహ్లి బర్త్ డే సెంచరీ.. గావస్కర్ జోస్యం ఫలించింది!

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి తన పుట్టినరోజు నాడు సెంచరీ కొడతాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ముందే ఊహించారు.

Virat Kohli scores 49th ODI century Gavaskar prediction came true

Gavaskar on Kohli Century: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చిరస్మరణీయమైన సెంచరీతో తన 35వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ సాధించి క్రికెట్ అభిమానులకు ఆనందం పంచాడు. అంతేకాదు పుట్టినరోజు నాడు సెంచరీ సాధించిన అతి కొద్ది ప్లేయర్ల లిస్టులోనూ స్థానం సంపాదించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసి చూపించాడు.

కాగా, విరాట్ కోహ్లి సెంచరీల గురించి టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ అంచనా కొంతవరకు నిజమయిందని అభిమానులు అంటున్నారు. దాదాపు 10 రోజుల క్రితం కోహ్లి సెంచరీల రికార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గావస్కర్. కింగ్ కోహ్లి తన పుట్టినరోజు నాడు 50వ సెంచరీ చేసి.. సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పారు. కోహ్లి 50వ శతకం సాధించడానికి ఈడెన్ గార్డెన్ మంచి వేదిక అని కూడా అన్నారు. ఈడెన్ గార్డెన్ లో సెంచరీ చేస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కూడా వ్యాఖ్యానించారు.

గవాస్కర్ జోస్యం కొంతవరకు ఫలించిందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. పుట్టినరోజు నాడు కోహ్లి సెంచరీ చేశాడు. అయితే అది 49వ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో జరిగే మ్యాచ్ లోనూ కోహ్లి సెంచరీకి (88) చేరువగా వచ్చిన సంగతి తెలిసిందే. ఏదైమైనా బర్త్ డే నాడు కోహ్లి సెంచరీ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తర్వాతి మ్యాచ్ లోనూ శతకం బాది సచిన్ రికార్డును అతడు బ్రేక్ చేస్తాడని ఎదురు చూస్తున్నారు. నవంబర్ 12న నెదర్లాండ్స్ తో టీమిండియా తర్వాతి మ్యాచ్ ఆడనుంది.

Also Read: విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో టైమ్డ్ ఔటైన తొలి ఆట‌గాడు ఇత‌డే..

ట్రెండింగ్ వార్తలు