Angelo Mathews : విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో టైమ్డ్ ఔటైన తొలి ఆట‌గాడు ఇత‌డే..

క్రికెట్ లో సాధార‌ణంగా బ్యాట‌ర్లు క్యాచ్, ఎల్బీ, క్లీన్‌బౌల్డ్ లేదా ర‌నౌట్‌ కావ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అప్పుడ‌ప్పుడు హిట్ వికెట్ రూపంలోనూ పెవిలియ‌న్‌కు చేరుతుంటారు.

Angelo Mathews : విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో టైమ్డ్ ఔటైన తొలి ఆట‌గాడు ఇత‌డే..

Angelo Mathew

Angelo Mathews timed out : క్రికెట్ లో సాధార‌ణంగా బ్యాట‌ర్లు క్యాచ్, ఎల్బీ, క్లీన్‌బౌల్డ్ లేదా ర‌నౌట్‌ కావ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అప్పుడ‌ప్పుడు హిట్ వికెట్ రూపంలోనూ పెవిలియ‌న్‌కు చేరుతుంటారు. అయితే.. శ్రీలంక బ్యాట‌ర్ ఏంజెలో మ‌థ్యూస్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌, శ్రీలంక మ్యాచ్‌లో చోటు చేసుకుంది. మాథ్యూస్ ఔటైన విధానం పై ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

అస‌లు ఏం జ‌రిగింది..?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ 24.2వ‌ ఓవ‌ర్ల‌లో 135 ప‌రుగుల వ‌ద్ద స‌దీర స‌మ‌ర‌విక్ర‌మ నాలుగో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. దీంతో ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్‌కు వ‌చ్చేందుకు సిద్ధం అయ్యాడు. మైదానంలోకి స‌గం దూరం వ‌చ్చేశాడు. అయితే.. త‌ప్పుడు హెల్మెట్ తెచ్చుకున్నట్లు గ్ర‌హించాడు. వెంట‌నే మ‌రో హెల్మెట్ ను తెప్పించుకున్నాడు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు కూడా అత‌డు క్రీజును చేర‌లేదు. మైదానం మ‌ధ్య‌లో ఉన్నాడు. దీంతో బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేశారు. అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్ర‌క‌టించారు.

ODI World Cup 2023 : ర‌స‌వ‌త్త‌రంగా సెమీస్ రేసు.. రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్ల పోటీ.. ఏ జ‌ట్లు సెమీస్ చేరుతాయంటే..?

తాను త‌ప్పుడు హెల్మెట్ తెచ్చుకోవ‌డంతో క్రీజులోకి రాలేద‌ని, మాథ్యూస్ అంపైర్లు, బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్‌, ఆట‌గాళ్లకు చెప్పాడు. అత‌డు ఎంత‌గా న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికి బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అప్పీల్‌ను వెన‌క్కి తీసుకోక‌పోవ‌డంతో మాథ్యూస్ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు వెళ్లాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలా టైమ్డ్ ఔటైన మొద‌టి బ్యాట‌ర్‌గా మాథ్యూస్ రికార్డుల‌కు ఎక్కాడు.

నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి..?

ఓ బ్యాట‌ర్ ఔట్ అయిన త‌రువాత మూడు నిమిషాల్లోపు కొత్త బ్యాట‌ర్లు క్రీజులోకి రావాలి. బంతిని ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అలా కానీ ప‌క్షంలో కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్‌ను ఔట్ గా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు అని ఎంసీసీ నిబంధ‌న‌ల్లో ఉంది.

ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వ‌ర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది