YSR Rythu Bharosa-PM Kisan Funds : వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ

ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు జమ చేశారు.

YSR Rythu Bharosa-PM Kisan Funds : ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులు జమ అయ్యాయి. 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ.1,090 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. 2022 డిసెంబర్ లో మాండోస్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది రైతుల ఖాతాల్లో రూ.76.99 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటికే రైతు భరోసా కింద రెండు విడతల్లో రూ.11,500 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో 300 కరువు మండలాలు ఉండేవని.. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు.

చంద్రబాబు వస్తే.. రాష్ట్రంలో కరవు వచ్చేదన్నారు. మంచి మనసుతో పని చేస్తుంటే దేవుడు కరుణిస్తున్నాడు.. వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే.. మనం మూడున్నరేళ్లలో 2.94 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించామని వెల్లడించారు. రైతు భరోసా కింద రూ.27 వేల కోట్లు అందజేశామని గుర్తు చేశారు. అసైన్డ్ భూములు ఉన్న రైతులకు కూడా సాయం చేశామని చెప్పారు.

YSR Law Nestham Scheme: బటన్ నొక్కి ‘వైఎస్ఆర్ లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్ ..

ఆర్బీకేలతో విత్తనం నుంచి పంట అమ్మే వరకు రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు. ఆర్బీకేలను దేశమంతా కావాలని అడుతున్నారని పేర్కొన్నారు. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. గత ప్రభుత్వం పంటల బీమా కింద 3,411 కోట్లు ఇస్తే.. మనం మూడున్నరేళ్లలో 6.685 కోట్ల బీమా ఇచ్చామని తెలిపారు. తుపాన్ లు వచ్చినా.. వరదలు వచ్చినా ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా లంచాలు, పైరవీలు లేవన్నారు.

ట్రెండింగ్ వార్తలు