UP రైల్వేస్టేషన్ : ఒంటరిగా ఉన్న బాలికపై నలుగురు అత్యాచారం

  • Publish Date - August 7, 2020 / 01:32 PM IST

మహిళలు..యువతులు..బాలికలపై జరుగుతున్నహింసల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని సర్వేల్లో తేలింది. దీనికి అద్దం పట్టే మరో ఘోరం యూపీలో వెలుగులోకొచ్చింది. 17 ఏళ్ల బాలికపై నలుగురు కామాంధులు పశువుల్లా అత్యాచారానికి తెగబడ్డారు. ఇటువంటివారిని పశువులు అనటానికి కూడా లేదు. పశువులు కూడా సిగ్గుపడే ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం బల్లియా జిల్లా రాస్టా రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది.



17 ఏండ్ల బాలిక మావ్‌ జిల్లా నుంచి తన అమ్మమ్మను కలవడానికని బల్లియా జిల్లాలోని రాస్టా రైల్వేస్టేషన్‌కు బుధవారం (ఆగస్టు 5,2020) సాయంత్రం వచ్చింది. రైలు కోసం ఎదురు చూస్తోంది. అలా బాలిక ఒంటరిగా రైల్వే స్టేషన్‌లో అటూ ఇటూ తిరుగుతుండడాన్ని నలుగురు వ్యక్తులు గమనించారు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి అనుసరించారు. ఎటువెళ్లే రైలు ఎక్కాలో తెలీక ఆమె టెన్షన్ పడుతోందిని గ్రహించారు. ఇదేఅదును అనుకుని సహాయం చేస్తామని నమ్మించారు.

ఎక్కడికెళ్లాలి అని అడిగారు. ఆమె చెప్పింది. నువ్వె వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయిందని..నిన్న మీ అమ్మమ్మ దగ్గరకు తీసుకెళతామని నమ్మించారు. ఈ-రిక్షాను ఎక్కించారు. ఆ తరువాత రైల్వేస్టేషన్‌ దగ్గరలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. తాను మోసపోయానని గ్రహించి హడలిపోయిన ఆ అమాయకురాలు తప్పించుకోవటానికి యత్నించింది. కానీ వారి పశుబలం ముందు లేడిపిల్లల్లా విలవిల్లాడిపోయింది. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు, సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు.



బాలిక పెద్దగా కేకలు పెడుతుండడంతో స్థానికులు విని పరుగుపరుగున ఘటనా స్థలానికి రావటాన్ని దూరం నుంచి చూసిన ఆ నలుగురు దుర్మార్గులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా బాలికను వైద్య పరీక్షలకు ఆస్పటిల్ కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వారి గురించి సమచారం తెలుసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నామని..నిందితులందరూ 25 నుంచి 35 ఏళ్లలోపు వారేనని స్థానికంగా కూలి పనులు చేసుకుంటూంటారని ఏఎస్పీ సంజయ్ యాదవ్ తెలిపారు.