పొత్తులు నై..పోరే : ఏపీలో నాలుగు స్తంభాలాట

  • Publish Date - January 23, 2019 / 12:29 PM IST

విజయవాడ : ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. కొద్ది నెలల్లో జరిగే ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమౌతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించాలని..ఆయా పార్టీలు కలలు కంటున్నాయి. తమకు బలం బాగానే ఉందని…ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని..సింగిల్‌గానే బరిలోకి దిగాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే నాలుగు స్తంభాలాట తప్పనిసరి కానుంది. 

కాంగ్రెస్ : తెలంగాణ రాష్ట్రంలో సైకిల్‌ ఎక్కిన హస్తం…ఇక్కడ మాత్రం నో అంటోంది. తెలంగాణ రాష్ట్రంలో గెలిచి తీరుతామని..పక్కా టీఆర్ఎస్‌ని ఓడిస్తామని బీరాలు పలికిన ఈ రెండు పార్టీలు చతికిలపడ్డాయి. బాబుతో పొత్తుతో లాస్ అయిందని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే కామెంట్స్ కూడా చేశారు. ఏపీలో కూడా పొత్తు ఉంటుందా ? అనే చర్చ జరిగింది. దీనిపై క్లారిటీ వచ్చేసింది. సింగిల్‌గానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ జనవరి 23వ తేదీ బుధవారం ప్రకటించేసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో హస్తం గుర్తుపైనే పోటీకి సై అంటోంది. అంటే..టీడీపీతో పొత్తు లేకుండానే సొంతంగానే కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలువనుంది. 

టీడీపీ : తెలుగుదేశం పార్టీ..రెండోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీలో ఇదొకటి. ఇతర పార్టీల్లో ఉన్న నేతలకు తలుపులు బార్లా తెరుస్తూనే మరోపక్క ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు బాబు. అయితే..ఇక్కడ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా ? అనే అనుమానాలు అప్పట్లో వచ్చాయి. జనసేనతో పొత్తు ఉంటుందనే చర్చ జరిగింది. దీనిపై టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తు పెట్టుకొనే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ కామెంట్స్‌పై బాబు గుస్సా అయ్యారు. ఇక పవన్ అయితే టీజీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో కలిసే ఛాన్స్ లేదు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ మరోసారి దానితో కలిసి ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు ఉండదని కాంగ్రెస్ తేల్చడంతో టీడీపీది కూడా అదే దారి అని అర్థమైపోయింది. 

జనసేన : పొత్తులపై ఫస్ట్‌గానే జనసేన స్పందించింది. తాము వామపక్షాలతో మినహా…ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని జనసేన చీఫ్ పవర్ స్టార్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటందనే ఊహాగానాలు వట్టివేనని తేలిపోయిది. 175 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంటామని పవన్ ప్రకటించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ : ఈ పార్టీ కూడా ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలున్నాయి. ప్రత్యర్థి అయిన టీడీపీతో పొత్తు పెట్టుకొనే ఛాన్స్ లేదు. ఎవరితో పొత్తు పెట్టుకోమని జనసేన చెప్పడంతో ఈ పార్టీతో కూడా జత కట్టడానికి అవకాశమే లేదు. కాంగ్రెస్ కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పడంతో పొత్తు లేదని కన్ఫామ్ అయినట్లే. బీజేపీతో పొత్తు ఉంటుందా ? లేదా ? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఓ వర్గానికి చెందిన ఓట్లు దూరం అయ్యే అవకాశాలున్నాయని..జగన్ ఆలోచిస్తున్నట్లు టాక్. ఆ వర్గానికి చెందిన ఓట్లు పోకుండా ఉండాలే బీజేపీతో దూరంగా ఉండాలని వైెఎస్ఆర్ కాంగ్రెస్ థింక్ చేస్తోంది. వైఆర్ఎస్ కాంగ్రెస్ తరపున తెలంగాణ రాష్ట్రం నుండి ఎంఐఎం ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయి. 

బీజేపీ : ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై ఒంటికాలిపై లేస్తున్న కాషాయ దళం కూడా ఒంటరిగానే సై అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలను ఆ నేతలు రచిస్తున్నారు. కాంగ్రెస్, జనసేన, టీడీపీలతో పొత్తు అనేది ఉండదు. ఇక మిగిలింది..వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే. దీనితో పొత్తు ఉంటుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.