ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4.75 కిలోల బరువున్న మగశిశువుకు జన్మనిచ్చింది.
సిద్ధిపేట : జిల్లాలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4.75 కిలోల బరువున్న మగశిశువుకు జన్మనిచ్చింది. దౌల్తాబాద్ మండలం శేరుపల్లి బందారం గ్రామానికి చెందిన జక్కుల శ్వేత ప్రసవం కోసం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఫిబ్రవరి 23 శనివారం ఆమెకు 4.75 కిలోల బరువు ఉన్న మగశిశువు జన్మించాడు. అయితే సాధారణ ప్రసవంలో అధిక బరువు ఉన్న శిశువు జన్మించడం అరుదని వైద్యులు తెలిపారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.