చేపల చెరువుకు గండి..ఊరంతా నీరే

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 07:02 AM IST
చేపల చెరువుకు గండి..ఊరంతా నీరే

Updated On : November 15, 2019 / 7:02 AM IST

ఆ ఊరంతా నీరే..వర్షాలు పడలేదు..వరదలూ రాలేదు. కానీ ఆ ఊరు నిండా నీరు నిండిపోయింది. కారణం..ఈ ఊరిలోఉన్న 71 ఎకరాల చేపల చెరువుకు గండి పడింది. దీంతో కట్టలు తెంచుకున్న నీరు గ్రామాన్ని నింపేసింది. కృష్ణా జిల్లా మండలవల్ల మండలం నాగభూణంపురం గ్రామంలో అన్ని వీధులతో పాటు చాలా ఇళ్లు  జలమయం అయిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.  

71 చేపల చెరువుకు గండి పడటంతో నీరంతా గ్రామంలోకి చేరుకుంది. దీంతో గ్రామస్తులంతా నీటిని దారి మళ్లించేందుకు..గండిని పూడ్చటానికి  యత్నిస్తున్నారు.  అధికారులకు సమాచారం ఇచ్చినా వారు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట బలహీనంగా ఉండటంతో గండి పడిందని స్థానికులు అంటున్నారు. వరదలు వచ్చాయా అన్నట్లుగా ఉంది నాగభూణంపురం గ్రామం పరిస్థితి.