కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: 25మందికి గాయాలు

  • Publish Date - January 5, 2020 / 02:58 AM IST

కడప జిల్లాలోని మైదుకూరు మండలంలో ముదిరెడ్డిపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(05 జనవరి 2020) తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో గుజరాత్‌కు చెందిన 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రొద్దుటూరు, మైదుకూరు ఆస్పత్రులకు తరలించారు. తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.