మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ : బుద్ధా..నోరు ఉంది కదా అని పారేసుకోకండి

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు.

  • Publish Date - April 2, 2019 / 08:54 AM IST

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు. ఇటీవలే వైసీపీ కండువా కప్పుకున్న సినీ నటుడు మోహన్ బాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి మంచు ఫ్యామిలీ కౌంటర్ ఇస్తోంది. ఇటీవలే మోహన్ బాబుపై ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు రెస్పాండ్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 
Read Also : జగన్‌కు బిస్కెట్లు వేస్తే కుక్కలా విశ్వాసం చూపుతున్నాడు

‘TDP MLC బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి..ఎలక్షన్స్ ఉండేది ఇంకో 10 రోజులే..దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి. ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నింటికి ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చి పోకండి’. అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. దీనిపై బుద్ధా ఎలా స్పందిస్తారో చూడాలి. 
Read Also : బిగ్ బ్రేకింగ్ : మోహన్ బాబుకి ఏడాది జైలు శిక్ష