ప్రచారం మిగిలే ఉంది : బాబాయ్ ను పరామర్శించిన అబ్బాయ్

  • Publish Date - April 7, 2019 / 11:37 AM IST

బాబాయ్ పవన్ కల్యాణ్ ను పరామర్శించారు రాంచరణ్. వడదెబ్బకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన్న ఇంటికెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు చెర్రీ. బాబాయ్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కు వడదెబ్బ తగిలింది.  
జనసేనకు మద్దతుగా ప్రచారం చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని పవన్ నివాసానికి చేరుకున్న హీరో.. బాబాయ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డీ హైడ్రేట్‌తో బాబాయ్ (పవన్) బాధ పడుతున్నారని, నీరసంగా ఉన్నారని తెలిపాడు. ఎన్నికల ప్రచారం ఆపేయాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు. ఏపీలో త్వరలో పోలింగ్ ఉండటంతో అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొనబోతున్నట్లు తెలిపారు చెర్రీ. ప్రచార సమయంలో వైద్యులు వెంటే ఉండనున్నారు. దీనికి పవన్ తిరస్కరించారని రామ్ చరణ్ వెల్లడించారు.