నిజం విత్ శివాజీ : అమరావతి ఎంతో కాలం ఉండదు

  • Publish Date - April 7, 2019 / 09:10 AM IST

ఏపీ రాజధాని అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఎంతో కాలం ఉండబోదనని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం రాకపోతే తప్పకుండా తరలివెళుతుందన్నారు. కొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రదాన పక్షాల అభ్యర్థులు, అధినేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మాటల తూటాలు పేలుతున్నాయి. దీనితో రాజకీయాలు హిట్ హీట్‌గా ఉన్నాయి. తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలతో పాలిటిక్స్ మరింత హీట్ పెంచనున్నాయి. 

అమరావతిని ఎలా తరలిస్తారు ? 30 వేల ఎకరాలు రైతులు రాజధాని కోసం ఇచ్చారని శివాజీ గుర్తు చేశారు. అక్కడి నుండి తరలించాలని చూస్తున్నారని..ఒక వ్యక్తి కోసం..ఒక కుటుంబం కోసం అవసరమా ? అని ప్రశ్నించారు శివాజీ. కులం పేరుతో రాజధానిని తరలించే కుట్ర జరుగుతోందన్నారు. అమరావతిలో ఇటుక కూడా పడలేదని ఇటీవలే జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు శివాజీ మీడియా ముందుకొచ్చారు. ఏప్రిల్ 07వ తేదీ ఆదివారం ‘నిజం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అమరావతి బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని చెప్పిన శివాజీ అమరావతిలో పర్యటించి అక్కడ షూట్ చేసిన వీడియోలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. మరి శివాజీ వ్యాఖ్యలపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో వెయిట్ అండ్ సీ.