నాట్యమాడిన ఎమ్మెల్యే రోజా.. ఎందుకంటే?

  • Publish Date - March 8, 2020 / 05:11 AM IST

సినిమా రంగంలో సత్తా చాటుకుని, రాజకీయ రంగంలో దూసుకుపోతూ.. టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్న సినీనటి, ఎమ్మెల్యే రోజా తన భరత నాట్య కలను కూడా ప్రదర్శించారు. 

 

లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా భరత నాట్యం చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌తో సహా రోజా దంపతులు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు. 

లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తమిళి సై సౌందర్‌రాజన్‌

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

రోజా నృత్య ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.