ఆదిలాబాద్ డీఈవో రవీందర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ డీఈవో రవీందర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణలో కొబ్బరికాయలు కొట్టొద్దు. పూజలు చేయొద్దు.. పూలమాలు వేయొద్దు… పసుపు కుంకుమ పెట్టొద్దు… పూజాసామాగ్రి వాడొద్దంటూ ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ విధంగా సర్క్యలర్ జారీ చేయడాన్ని పలువురు తప్పుబట్టారు. దీంతో డీఈవో సర్క్యులర్‌ను మార్చారు. డీఈవో క్షమాపణలు రవీందర్ రెడ్డి చెప్పారు.