Agrigold Case : 700 కోట్ల బినామీ ఆస్తులు

  • Publish Date - March 28, 2019 / 01:13 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌….7వందల కోట్ల బినామీ ఆస్తులు కలిగి ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో బాధితులు అఫిడవిట్‌ దాఖలు చేయడంతో కేసును మళ్లీ విచారణ చేపట్టింది హైకోర్టు. 65 మంది డైరెక్టర్ల ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏపీ సీఐడీని ఆదేశించింది. 

65 మంది డైరెక్టర్ల దగ్గర ఇంకెన్ని ఆస్తులు ఉంటాయని బాధితులు పిటిషన్‌లో అనుమానం వ్యక్తం చేశారు. 65 మంది అగ్రిగోల్డ్‌ డైరెక్టర్ల బినామీ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయించి న్యాయం చేయాలని బాధితులు కోర్టును కోరారు. బాధితుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు….65 మంది డైరెక్టర్లపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. 

అగ్రిగోల్డ్‌కు సంబంధించి తెలంగాణలో 12వందల ఎకరాల భూములు ఉన్నాయని…ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిడ్జిల్‌లో ఉన్న 150 ఎకరాల భూమిని 15కోట్ల వేలం వేసిందన్నారు బాధితులు. వేలం ద్వారా వచ్చిన సొమ్మును….కోర్టులో జమ చేశారని అగ్రిగోల్డ్‌ బాధితులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను వేలం వేయాలని హైకోర్టును కోరామన్నారు.