ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఈవీఎంలు మొరాయించడం..పోలింగ్ ఏజెంట్లు సకాలంలో చేరుకోకపోవడతో మాక్ పోలింగ్ ప్రారంభం కాలేదు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించడానికి నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజాంలోని గవర్నమెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల్లో సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనితో మాక్ పోలింగ్ నిర్వహించడం లేదు. టెక్నికల్ నిపుణులు ఈవీంఎంలను చెక్ చేస్తున్నారు. శ్రీకాకుళం, పలాస తదితర ప్రాంతాల్లో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి.
ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.