ఇటీవల తొలిదశలో పూర్తయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పటివరకు రూ.550-600 కోట్లు వరకు ఉండవచ్చునని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు.
ఇటీవల తొలిదశలో పూర్తయిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా? ఇప్పటివరకు రూ.550-600 కోట్లు వరకు ఉండవచ్చునని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వెల్లడించారు. ఈవీఎంలు, రవాణాఖర్చు, ఎన్నికల సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది నిర్వహణ ఖర్చు మొత్తం ఇప్పటివరకు ఇంత అయినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. లోక్‌సభతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినందున ఖర్చు కొంతమేర తగ్గిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్
అయిన మొత్తం ఖర్చులో 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్రం భరించవలసి ఉంటుంది. అయితే ముందుగా మొత్తం ఖర్చును మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి పెట్టవలసి ఉంటుంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి పూర్తిస్థాయి బిల్లులు చూపిస్తే అందులో 50శాతం డబ్బును రాష్ట్రానికి తిరిగి కేంద్రం అందిస్తుంది.
కాగా మే 23వ తేదీ కౌంటింగ్ తర్వాత పూర్తిగా ఎంత ఖర్చు అయింది అనేది లెక్క తేలనుంది. ఇక తొలిదశ జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో 79.63 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.68 శాతం ఓటింగ్ పెరిగింది. ఏపీలో మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన రానున్నాయి.
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స