ఏపీలో ముగిసిన పోలింగ్

ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్‌లో ఎంతమంది ఉన్నా వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

  • Publish Date - April 11, 2019 / 12:31 PM IST

ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్‌లో ఎంతమంది ఉన్నా వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఏపీలో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్‌లో ఎంతమంది ఉన్నా వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ గురువారం పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతానికి పైగానే పోలింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది. 
Read Also : EVMలు బాగా పని చేస్తున్నాయ్.. తప్పుడు వార్తలు నమ్మొద్దు : ఈసీ ద్వివేదీ

ఓట్లర్లలో చైతన్యం కనిపించింది. ఉదయం 6గంటల నుండే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కానీ..కొద్ది సమయం తరువాత ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, ప్రకాశం, ఒంగోలు, చిత్తూరు తదితర జిల్లాల్లో టీడీపీ – వైసీపీ నేతలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడంతో మరింత టెన్షన్ నెలకొంది. 

పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ సమయాన్ని పెంచాలని నేతలు కోరారు. ఈవీఎంల మొరాయింపుపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ నేతలు ఏపీ డీజీపీకి అందచేశారు. వైసీపీ నేతలపై కంప్లయింట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈవీఎంలు మొరాయించడం..నేతలు చేసిన ఆరోపణలను ఈసీ అధికారి ద్వివేది ఖండించారు. మొరాయించిన ఈవీఎంల్లో నెలకొన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించినట్లు..ఆధారాలతో నిరూపించాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

  • ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు గురువారమే పోలింగ్ జరిగింది. 
  • ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలు..175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 
  • టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.
  • ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2 వేల 118 మంది, 25 లోక్‌సభ సీట్లకు 319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Read Also : తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ