APలో ఓట్ల వర్షం : 80 శాతం పోలింగ్!

ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.

  • Publish Date - April 12, 2019 / 01:29 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు, పట్టణాల్లో ఓట్ల వర్షం వెల్లువెత్తింది. ఎండలు మండుతున్నా ప్రజలు వెనుకడగు వేయలేదు. ఫలితంగా AP చరిత్రలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 80 శాతానికి పోలింగ్ చేరవచ్చని ఈసీ అంచనా వేసింది. అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగడంతో.. పూర్తిస్థాయి లెక్కలను ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం వెల్లడించే అవకాశం ఉంది. 
Read Also : APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ?

2014 ఎన్నికల్లో 77.96 శాతం పోలింగ్‌ జరగ్గా, ఈసారి అది 80 శాతం వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 74 శాతం నమోదైందని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీకాకుళంలో 74.18 శాతం, విశాఖపట్టణంలో 76.4 శాతం, తూర్పుగోదావరిలో 74.28, పశ్చిమగోదావరిలో 70.59, కృష్ణాలో 71.18, గుంటూరులో 72.7, ప్రకాశంలో 73.52, నెల్లూరులో 68.25, కడపలో 71.3, కర్నూలులో 68 శాతం, అనంతపురంలో 71.63, చిత్తూరులో 72.4 శాతం పోలింగ్‌ నమోదైంది. 

రాత్రి 9 గంటల వరకు 726 కేంద్రాల్లో పోలింగ్‌ సాగగా… మరికొన్ని కేంద్రాల్లో అర్థరాత్రి దాటే వరకూ ఓటింగ్‌ కొనసాగింది. దీంతో స్పష్టంగా ఎంత శాతం పోలింగ్‌ అయ్యిందనే వివరాలను ఈసీ ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల కంటే కనీసం నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్