దెందలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ బెయిల్ రావడంతో 67 రోజుల తర్వాత ఏలూరు జైలు నుంచి బయటకొచ్చారు. అయితే బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్‌పై లేటెస్ట్‌గా మరో కేసు నమోదైంది.
ఇటీవల చింతమనేని జైలు నుంచి విడుదలయ్యాక నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది.
చింతమనేని ప్రభాకర్ విడుదలైనప్పుడు జైలు దగ్గరకు భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చింతమనేని జైలు నుంచి బయల్దేరి తన ఇంటికి వెళ్లారు.
దీనిని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారంటూ చింతమనేనిపై కేసు నమోదు చేశారు. దళితులను దూషించిన కేసులో అరెస్టైన చింతమనేని ఇప్పటికే 18 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.