జనసేన పార్టీకి ఇప్పటికే కీలక నేతలు రాజీనామా చెయ్యడంతో ఆ పార్టీ ఇబ్బందులకు గురవుతుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మరో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితులు గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు ఆ పార్టీని వీడారు. 2019ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఒకటి గాజువాక.
పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సొంత నియోజకవర్గంలో కీలక నేత అయిన కరణం కనకారావు ఆ పార్టీకి రాజీనామా చెయ్యడం షాక్ అనే చెప్పుకోవాలి. ఒకవైపు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడడం ఆ పార్టీని కాస్త ఇబ్బందుల్లోకి నెట్టడమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు.
పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుండటం వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు ఆయన చెప్పగా.. అదే కోవలో సీనియర్ నేత అయిన కనకారావు 200 మంది జనసేన కార్యకర్తలతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.