ఏపీ అసెంబ్లీ బడ్జెట్ : గవర్నర్ స్పీచ్ హైలెట్స్

  • Publish Date - January 30, 2019 / 04:25 AM IST

విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కూడా ప్రదాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంది. సమావేశాల ప్రారంభానికంటే ముందు సీఎం చంద్రబాబు నాయుడు వెంకటాయపాలెం వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పచ్చచొక్కాలు ధరించి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. 

ఇక గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు…
* విభజన కారణంగా ఏపీ నష్టపోయింది
అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి
2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం.
2050 నాటికి ప్రపంచంలో ప్రముఖ ప్రాంతంగా ఏపీ.
ఎన్టీఆర్ ఫించన్ల రెట్టింపు.
అవినీతి రహితంగా పారదర్శకంగా పాలన. 
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11 శాతం వృద్ధి రేటు.
అనేక రంగాల్లో సంతృప్తికర స్థాయి సాధించాం.
సంక్షేమ రంగానికి పెద్ద పీట.
ఆదరణ పథకం కింద వృత్తిదారులకు పరికరాలు.
అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం అమలు. 
టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవల చేరువ. 
ఆటో, ట్రాక్టర్లపై జీవిత పన్ను రద్దు. 
2014-2019 కోసం ప్రత్యేకంగా విజన్.