ఏపీ బడ్జెట్ : కొత్తగా వచ్చిన పథకాలు ఇవే

  • Publish Date - February 5, 2019 / 08:06 AM IST

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రూ.2లక్షల 26వేల 177.53 కోట్ల భారీ పద్దును రూపొందించారు. ఇప్పటికే అమలులో పథకాలతోపాటు కొత్తగా ఆరు పథకాలను తీసుకొచ్చారు. వీటికి కేటాయింపులు కూడా జరిపారు. 

చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చిన కొత్త పథకాలు ఇలా ఉన్నాయి :

1. అన్నదాత సుఖీభవ – రూ. 5 వేల కోట్లు
2. క్షత్రియ కార్పొరేషన్ – రూ. 50 కోట్లు
3. గృహ నిర్మాణాలకు భూసేకరణ – రూ. 500 కోట్లు
4. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి ప్రోత్సాహానికి  – రూ. 400 కోట్లు
5. డ్రైవర్ల సాధికార సంస్థ – రూ. 150 కోట్లు
6. మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన – రూ.100 కోట్లు