వైఎస్ వివేకాను చంపించింది చంద్రబాబే: జగన్ పైన కుట్రలు చేస్తున్నారు

  • Publish Date - September 4, 2019 / 09:05 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెన్నుపోటు, హత్యా రాజకీయాలుకు చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్ అంటూ మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించారనే కక్ష పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చెందనీయకూండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

నీచ రాజకీయాలకోసం వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను ఏవిధంగా చంపించారో హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో స్పష్టంగా చెప్పారని అన్నారు. చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు లక్షల కోట్లు దోచుకున్నారని, చంద్రబాబు, లోకేష్‌ చేసిన దోపీడీలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయని అన్నారు శ్రీకాంత్ రెడ్డి.

ప్రతిపక్షంలోకి వెళ్లాక కూడా అరాచకాలు చేస్తున్న మీరు మా గురించి మాట్లాడతారా? అంటూ చంద్రబాబుని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాదిరిగా పోలీసులకు పచ్చచొక్కాలు తొడగలేదని అన్నారు. గ్యాంగ్‌ స్టర్లు, రేపిస్టులు, ఫ్యాక్షనిస్టులు ఉండేది టీడీపీలోనే అని మండిపడ్డారు.

నెగిటివ్‌ పబ్లిసిటీతో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నలభై ఐదేళ్ల యువకుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపనతో పనిచేస్తుంటే సపోర్ట్ చేయకపోగా కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి లేని పాలనే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీకాంత్ రెడ్డి.