ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్ వంద రోజుల పాలనపై టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన నాయకులు ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రభుత్వ పాలనపై పెదవి విరిచారు. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశారు.
తుగ్లక్ పాలనలో ధర్నా చౌక్ ఫుల్..అభివృద్ధి నిల్..సంక్షేమం డల్ అంటూ ట్వీట్ చేశారు. అమరావతిని ఏడారి చేశారు..పోలవరాన్ని మంగళవారంగా మార్చారు..900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారని తెలిపారు. ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదన్నారు.
ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి సీఎం నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారని చెప్పారు. పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి EKYC అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారని విమర్శించారు. ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగా అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగక కాకపోతే! అంటూ ట్వీట్‌లో నారా లోకేష్ వెల్లడించారు.
మరోెవైపు 100 రోజుల పాలన సందర్భంగా భవిష్యత్‌లో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనుందో సీఎం జగన్ క్యాలెండర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రతి నెలా పేద ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
Read More : మంచి పనులు చేస్తే ఎందుకు ఓడించారు
> సెప్టెంబర్ నెల చివరి కల్లా స్వంత ఆటో, స్వంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి రూ.10 వేలు ఇవ్వనున్నాం.
> అక్టోబర్ 15 వ తేదీన రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి రూ. 12 వేల 500 ఇవ్వనున్నాం.
> నవంబర్ 21 వ తేదీ నుంచి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి రూ.10 వేల రూపాయలు అందజేస్తాం. ప్రతి జిల్లాలో గ్రామాల్లో బంకులను డెడికేడ్ చేసి…అక్కడికి వెళ్లి పెట్రోల్, డీజిల్ పోయించుకోవచ్చని, ఇందుకు రూ.9 సబ్సిడీ ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
> డిసెంబర్ నెలలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా ఇంటికి వచ్చి రూ.24 వేల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపారు.
> జనవరి 26 న అమ్మఒడికి శ్రీకారం చుడతామని చెప్పారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
> ఫిబ్రవరి చివరి వారంలో కటింగ్ షాపులు ఉన్న నాయి బ్రాహ్మణులకు టైలర్లు, రజకులు రూ.10 వేలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
> మార్చి నెలలో అర్చకులకు, ఇమామ్ లు, మౌజాంలు, ఫాస్టర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయనున్నట్లు తెలిపారు.
> ఉగాది రోజున ఇళ్ల స్థలం లేని ప్రతి అక్కచెల్లెమ్మళ్లకు 25 లక్షల ఇళ్లపట్టాల రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు చెప్పారు.
> ఏప్రిల్ నెలలో వచ్చే శ్రీరామనవమి పండుగ రోజున వైఎస్సార్ పెళ్లికానుక అమలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు.
ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారు. పేద ప్రజలకు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకేవైసి అంటూ క్యూ లైన్లలో నిలబెట్టారు. ఈమాత్రం దానికి వందరోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా! ఎందుకు ప్రజల సొమ్ము దండగ కాకపోతే !! #100DaysThughlaqJagan
— Lokesh Nara (@naralokesh) September 7, 2019
తుగ్లక్ 2.0 @100 డేస్
తుగ్లక్ గారి పాలనలో ధర్నాచౌక్ ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం డల్… అమరావతిని ఎడారి చేసారు, పొలవరాన్ని మంగళవారంగా మార్చారు. 900 హామీలను నవరత్నాలంటూ 9 హామీలకు కుదించారు. ఇంతా చేసి ఏమన్నా సాధించారా అంటే అదీ లేదు.— Lokesh Nara (@naralokesh) September 7, 2019