ఈసీపై బాబు ఫైర్ : మోడీ మీటింగ్‌కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు

  • Publish Date - May 3, 2019 / 11:32 AM IST

మరోసారి ఎన్నికల కమిషన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తుఫాన్‌పై సమీక్షలు చేయవద్దా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా బాబు వర్సెస్ ఎన్నికల సంఘం..ఏపీ సీఎస్‌ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫోని తుఫాన్‌పై ఈసీకి లేఖ రాసినట్లు..అయినా స్పందించలేదని ఆయన తెలిపారు. మే 03వ తేదీన ఏపీపై ఫోని ప్రభావం చూపించింది. తుఫాన్‌కు సంబంధించిన వివరాలను బాబు మీడియాకు వెల్లడించారు. 

ఎన్నికల కమిషన్ మరోసారి అడ్డు తగిలిందని..సైక్లోన్ వెళ్లిపోయిన తర్వాత ఈసీ పర్మిషన్ ఇచ్చిందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ హద్దులు తెలియకుండా ప్రవర్తిస్తోందని…PM మోడీ మాత్రం దర్జాగా మీటింగ్‌లు..కేబినెట్ సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ఈసీ తన హద్దులు తెలుసుకోవాలని..ప్రజాసామ్యంలో ఇలా వ్యవహరించకూడదన్నారు. ఎన్నికలకు, రెగ్యులర్ గవర్నెన్స్, ఎమర్జెన్సీకి వ్యత్యాసం ఉందన్నారు. రెగ్యులర్ గవర్నెన్స్లో ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదని చెప్పారు.

తాను గౌరవించి లెటర్ రాస్తే…టైంలో కూడా రెస్పాండ్ కాలేదన్నారు. పీఎంకు ఎవరు ఫర్మిషన్ చ్చారు ? రాజ్యాంగం ఈసీకి అధికారాలు ఇచ్చింది..ప్రభుత్వానికి కూడా అధికారాలు ఇచ్చారని..అది గుర్తు పెట్టుకోవాలని బాబు సూచించారు. 

ఫోని తుపాను ఆంధ్రప్రదేశ్‌ను దాటినా… ప్రభావం మాత్రం ఉంది. మే 03వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. తుఫాను ప్రభావంతో మూడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, విద్యుత్‌ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార‍్మర్లు కూడా పడిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.