ఏపీలో ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. పిట్టువారిపాలెంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పలువురు గాయపడ్డారు. అడ్డుకున్న పోలీసులకు సైతం గాయాలయ్యాయని సమాచారం. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో ఓటర్లు భయాందోళనలకు గురయ్యారు. ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్..టీడీపీ అభ్యర్థి కరణం బలరాంలు పోటీ పడుతున్నారు. సెన్సిటివ్ నియోజకవర్గాల్లో పోలీసులు సరైన భద్రత తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.