బ్రేక్ ఫాస్ట్ చేసి..తలనొప్పిగా ఉందని రూమ్‌లోకెళ్లి ఉరివేసుకున్న కోడెల 

  • Publish Date - September 16, 2019 / 09:52 AM IST

ఏపీ మాజీ స్పీకర్ కోడెల్ శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి..తల నొప్పిగా ఉందని కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంట్లో ఉన్న కుమార్తెతో చెప్పి  మేడమీదకు వెళ్లిన కోడెల శివప్రసాద్ రూమ్ లోకి వెళ్లి బోల్ట్ వేసుకున్నారనీ..తరువాత ఆయన తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అన్నారు. 

కోడెల పడుకునేందుకు ఎప్పుడు రూమ్ లోకి వెళ్లినా ..డోర్ కు బోల్ట్ వేసుకోరనీ..కానీ మరణించిన రోజున మాత్రం లోపలికి వెళ్లి బోల్ట్ వేసుకోవటం చూసిన సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి డోర్ కొట్టారు.అయినా కోడెల తలుపు తీయలేదు. దీంతో మరింత అనుమానం వచ్చిన సెక్యూరిటీ రూమ్ వెనక్కి వెళ్లి కిటికీ నుంచి లోపలికి చూసేసరికి ఆయన ఉరి వేసుకుని వేలాడుతుండటాన్నిచూసి వెంటనే తలుపులు పగుల గొట్టి వెంటనే బసవతారకం ఆస్పత్రికి తరలించారనీ తెలిపారు.

క్టర్లు వెంటనే వెంటిలేటర్ పై చికిత్సనందించినా..కోడెల దక్కలేదని..మృతి చెందానీ వర్ల రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరించిందనీ..వేధింపులు భరించలేక కోడెల ఆత్మహత్య చేసుకుని మరణించారనీ వర్ల రామయ్య ఆరోపించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా పోరాడే వ్యక్తిని ఈరోజున ఆత్మహత్య చేసుకోవటం విచారకరమని వర్లరామయ్య అన్నారు.