కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానిక ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాలనుంచి వచ్చిన వారిని పర్యవేక్షించటానికి ప్రతి 10 మందికి ఒక అధికారిని నియమించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమీక్ష నిర్విహంచిన ఉన్నతాధికారుల ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు.
మండల స్థాయిలో కొంతమంది అధికారులను కొవిడ్-19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి రోజు వివరాల నమోదు, డేటా ఆధారంగా వైద్య శాఖ చర్యలు తీసుకోనుంది.
కరోనావైరస్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో నలుగురు ఏఏఎస్‌ల బృందం ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది.