ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ ఉత్తర్వులో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం

  • Publish Date - November 7, 2019 / 06:21 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు దీనిని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ ఉత్తర్వులో చిన్న మార్పు చేసింది ప్రభుత్వం. తొలుత జారీ చేసిన జీవోలో.. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల్లో ఇంగ్లీష్ తరగతులు జరపాలని అనుకోగా.. ఇప్పుడు 2021-22 విద్యా సంవత్సరంలో తొమ్మిది తరగతిలో, 2022-23లో పదో తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుని ఉత్తర్వు విడుదల చేసింది.

అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూ సబ్జెక్టుగా పెట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. దీని గురించి విజ్ఞుల నుంచి సూచనలు కూడా తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.