కొత్త ట్రాఫిక్ చలాన్ల చట్టం : ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తున్నారు. రూల్స్ బ్రేక్

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తున్నారు. రూల్స్ బ్రేక్
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టంలో ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే.. ఒక్కో వాహనానికి వేలు, లక్షల రూపాయల చలాన్లు రాస్తున్నారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనంతో రోడ్డు ఎక్కాలంటే వణికిపోతున్నారు. కొత్త మోటారు వాహన చట్టంపై వాహనదారుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాల విషయంలో కొంత ఆలోచిస్తున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా వాహనదారులకు రిలీఫ్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో వాహనదారులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుందని సమాచారం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ట్రాఫిక్ జరిమానాలపై ఏపీ సర్కార్ కు రవాణ శాఖ కమిటీ రూపొందించిన నివేదిక అందింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేంద్రం నిర్ణయించినట్లుగా 10 రెట్ల జరిమానాలు వద్దని.. మీడియంగానే విధించాలని రవాణ అధికారుల కమిటీ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంటే కేంద్రం విధించిన జరిమానాల మొత్తంలో సగం అన్నమాట. చలాన్లపై కమిటీ రూపొందించిన సిఫారసుల నివేదికపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10రెట్ల వరకు జరిమానాలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ బిల్లు-2019ను పార్లమెంట్ సమావేశాల్లో సవరించి ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్-200 ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఫైన్లు అమలు చేయాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.
అయితే, ఈ చట్టం కింద జరిమానాలు అంత పెద్ద మొత్తంలో విధించే ముందు ప్రజలకు అవగాహన కల్పించి, మధ్యస్తంగా జరిమానాలు ఉండేలా ఏపీ రవాణ అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పలు రాష్ట్రాలతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అంత పెద్ద మొత్తంలో వాహనదారులపై జరిమానాలు విధించేందుకు ఆయా ప్రభుత్వాలు సుముఖంగా లేవు.
ఏపీలోనూ ట్రాఫిక్ జరిమానాలపై రవాణ శాఖ డిప్యూటీ రవాణా కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లతో అంతర్గతంగా ఓ కమిటీని నియమించుకుంది. ఈ కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలు, కేంద్రం కొత్తగా విధించాలన్న జరిమానాలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించింది. 10 రెట్ల జరిమానాలు రాష్ట్రంలో విధించొద్దని, కేంద్రం నిర్దేశించినట్లుగా కాకుండా మధ్యస్తంగా జరిమానాలు విధించాలని కమిటీ అభిప్రాయపడి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపింది. ముందుగా వాహనదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, అప్పటివరకు ఓ మోస్తరు జరిమానాలతో సరిపుచ్చాలని అందులో సూచించారు. ప్రభుత్వ నుంచి ఆమోదం వస్తే కేంద్రం నిర్దేశించిన దానికంటే తక్కువగానే జరిమానాలు విధించేందుకు రాష్ట్ర రవాణ శాఖ సన్నద్ధమవుతోంది.
కాగా, రాష్ట్రంలో అన్ని కేటగిరీల వాహనాలు 90 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని నడిపే వారిలో 45 శాతం మందికి లైసెన్సు లేనట్లు రవాణ శాఖ గతంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యంగా టూ వీలర్ నడిపే వారిలో అధిక శాతం మందికి లైసెన్సు లేవు. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే గతంలో రూ.500 జరిమానా వేశారు. మోటారు వాహన సవరణ బిల్లులో ఆ ఫైన్ ని రూ.5 వేలకు పెంచారు. రవాణ శాఖ నివేదికపై ప్రభుత్వం చర్చించనుంది. ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోనుంది. రవాణ శాఖ అధికారులు చెప్పినట్టుగానే.. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిగే అనర్ధాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి మధ్యస్తంగా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్ర రవాణ అధికారుల కమిటీ సూచించిన జరిమానాలు:
ఉల్లంఘన | ప్రస్తుత జరిమానాలు | కేంద్రం నిర్దేశించినవి | రాష్ట్ర అధికారుల సిఫారసు |
రోడ్డు నిబంధన అతిక్రమణ | రూ.100 | రూ.500 | రూ.250 |
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే | రూ.500 | రూ.5వేలు | రూ.2500 |
అర్హత లేకుండా వాహనం నడిపితే | రూ.500 | రూ.10వేలు | రూ.4వేలు |
ఓవర్ సైజ్డ్ వాహనాలు | లేదు | రూ.5వేలు | రూ.1000 |
డేంజరస్ డ్రైవింగ్ | రూ.1000 | రూ.5వేలు | రూ.2,500 |
డ్రంకెన్ డ్రైవింగ్ | రూ.2వేలు | రూ.10వేలు | రూ.5వేలు |
సీటు బెల్ట్ | రూ.100 | రూ.1000 | రూ.500 |
ఇన్సూరెన్స్ లేకుంటే | రూ.1000 | రూ.2వేలు | రూ.1250 |