బోండా ఉమా పై కేసు నమోదు చేయండి : హై కోర్టు ఆర్డర్

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది.

  • Publish Date - April 9, 2019 / 11:12 AM IST

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది.

విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయాలని ఏపీ హై కోర్టు ఆదేశించింది. తన కుమార్తె సాయిశ్రీ మరణానికి కారణం.. భర్త మాదంశెట్టి శివకుమార్, mla బోండాఉమా మహేశ్వరరావు, అతని అనుచరులే కారణం అని 2017 ఏప్రియల్ లో సుమశ్రీ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో అధికార పార్టీ ఒత్తిడులకు తలొగ్గిన పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు బోండా ఉమాపై కేసు నమోదు చేయాలని ఆర్డర్ ఇచ్చింది. 
Read Also : కరువు వెక్కిరిస్తోంది : చెన్నైవాసుల తాగునీటి కష్టాలు తప్పేనా?

ఆర్డర్ కాపీతో సుమశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసారు. ఆయన సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ కు కేసు రిఫర్ చేసారు.  కాగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన సుమశ్రీ కి చుక్కెదురైంది.  సిఐ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా, కేసు నమోదులో పోలీసులు జాప్యం చేస్తున్నారని, మాదంశెట్టి శివకుమార్,  బోండా ఉమామహేశ్వరరావు వల్ల తనకు ప్రాణ హని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
Read Also : వైసీపీకి అడ్రస్ ఉండదు.. డిపాజిట్ కూడా దక్కదు