స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా.. ఎకగ్రీవాలు రద్దు కావు

  • Publish Date - March 15, 2020 / 05:20 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఏపీలో పంచాయితీ ఎన్నికలు వాయిదా వెయ్యగా.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది.

ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయగా.. ఇప్పటివరకూ జరిగిన ఎన్నిక ప్రక్రియ యధావిథిగా ఉంటుందని, కేవలం జరగాల్సిన ఎన్నికలు మాత్రమే వాయిదా వేస్తున్నట్లు ఈసీ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు.

అత్యున్నత స్థాయి సమీక్ష అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు మాత్రం కొనసాగుతారని స్పష్టం చేశారు.