మంత్రికి కృతజ్ఞతలు : ఆటోవాలాగా అచ్చెన్నాయుడు

  • Publish Date - January 25, 2019 / 01:20 PM IST

శ్రీకాకుళం : రాష్ర్ట రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆటోవాలాగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి జనవరి 25వ తేదీ నిమ్మాడలోని తన ఇంటినుంచి ఆటో నడుపుతూ వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా అచ్చెన్నాయుడు ఆటో డ్రైవింగ్‌ చేస్తుంటే.. ఆయన  వెనకాలే కాన్వాయ్‌ కూడా అనుసరించింది. ఆటోలకు పన్ను వెసులుబాటు కల్పించినందుకు ఆటో యూనియన్‌ నేతలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.